ఢిల్లీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై 25 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే మద్యం విక్రయించాలని ఆదేశించింది. ఆధార్ కార్డు, ఓటర్ ఐడీలలో వారి వయస్సును చెక్ చేసిన తర్వాతే అమ్మకాలు చేయాలని క్లబ్లు, బార్లు, రెస్టారెంట్ల నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేసింది. ఓన్లీ ఫిజికల్ ఐడీలు మాత్రమే చెక్ చేయాలని, వర్చువల్ ఐడీలను చెక్ చేయకూడదని తెలిపింది. దీనిని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.