చైనాపై అమెరికా తీవ్ర ఆరోపణలు చేసింది. యెమెన్‌లో హూతీ రెబల్స్‌కు ఎర్ర సముద్రంలోని నౌకల సమాచారాన్ని చైనా ఉపగ్రహాలు చేరవేస్తున్నాయని ఆరోపించింది. ఈ చర్యలను ఏమాత్రం ఆమోదించమని వాషింగ్టన్ హెచ్చరించింది. దీనిపై చైనా విదేశాంగశాఖ ప్రతినిధి స్పందించారు. ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతలను తగ్గించడానికి చైనా చురుకుగా కృషి చేస్తోందని తెలిపారు.