AP: పరకామణి కేసులో కీలక సాక్షి సతీష్ కుమార్ మృతిపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి స్పందించారు. సతీష్ కుమార్ మృతి తీవ్ర అనుమానాలు రేకెత్తిస్తోందని తెలిపారు. పరకామణి కేసులో సతీష్ కుమార్ కీలక వ్యక్తి అని చెప్పారు. ఆయన మృతిపై లోతైన విచారణ జరపాలని కోరారు. నిందితుడు రవికుమార్, సాక్షులకు భద్రత కల్పించాలన్నారు.