భారత్ తరపున అన్ని ఫార్మాట్లలోనూ ఆడాలనేది తన కోరిక అని టీమిండియా స్టార్ బ్యాటర్ రింకు సింగ్ తెలిపాడు. టెస్టుల్లోనూ అవకాశం వస్తే వదిలిపెట్టనని రింకు సింగ్ స్పష్టం చేశాడు. తన మార్గదర్శి సురేశ్ రైనా మాటలను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని చెప్పాడు. కాగా ప్రస్తుతం జరుగుతున్న యూపీ టీ20 లీగ్లో రింకు బౌండరీల మోత మోగిస్తున్నాడు.