పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ ధార్ చైనా పర్యటనలో ఉన్నారు. బీజింగ్‌లో జరుగుతున్న పాక్-చైనా 7వ వ్యూహాత్మక భేటీలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఇరు దేశాల మధ్య భద్రత, ఆర్థిక సహకారంపై కీలక చర్చలు జరగనున్నాయి. అలాగే ఆసియాలో నెలకొన్న తాజా పరిస్థితులపై కూడా ఇరువురు నేతలు చర్చించే అవకాశం ఉంది. చైనాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతోంది.