AP: రాష్ట్ర లిక్కర్ కేసులో దాడులపై ఈడీ ప్రకటనను విడుదల చేసింది. ఏకకాలంలో 20 ప్రాంతాల్లో తనిఖీలు చేసినట్లు వెల్లడించింది. హైదరాబాద్‌తో పాటు ఏపీ, బెంగళూరు, చెన్నై, తంజావూరు, సూరత్, రాయ్‌పూర్, ఢిల్లీలో సోదాలు చేసినట్లు తెలిపింది. ప్రభుత్వ ఖజానాకు రూ.4 వేల కోట్ల గండిపడినట్లు గుర్తించినట్లు పేర్కొంది. కిక్ బ్యాగ్‌ల రూపంలో వేల కోట్ల మనీలాండరింగ్ చేసినట్లు చెప్పింది.