అంతర్జాతీయ విద్యార్థులకు కెనడా షాక్ ఇచ్చింది. 50శాతం స్టడీ పర్మిట్స్ను తగ్గించడానికి కొత్త ఇమిగ్రేషన్ విధానాన్ని తీసుకురాబోతుంది. రాబోయే మూడేళ్లలో అంతర్జాతీయ విద్యార్థుల ఎంట్రీతో పాటు తాత్కాలిక నివాస హోదా కలిగినవారి సంఖ్యను తగ్గించనున్నట్లు కెనడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నూతన విధానంతో విద్యాసంస్థల నుంచి వచ్చే ఆదాయాలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు.