TG: పుస్తకాల్లో అనంతమైన జ్ఞానం ఉందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. శుభ కార్యాలకు వెళ్ళినప్పుడు బొకెలకు బదులుగా బుక్స్ ఇవ్వాలని సూచించారు. ‘పుస్తకాల్ని నమిలి మింగాలనేంత క్షుణ్ణంగా చదవాలి. ఈ బుక్స్ కంటే పుస్తకాల్లోనే మజా ఉంటుంది. రచయితతో డైరెక్ట్‌గా మాట్లాడుతున్నట్టు ఉంటుంది. విశ్వం గురించి తెలియాలంటే పుస్తకాలు చదవాల్సిందే’ అని పేర్కొన్నారు.