TG: పట్టభద్రల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ విషయం తెలియక చాలామంది సాధారణ రోజుల మాదిరిగా నగదుతో ప్రయాణిస్తున్నారు. ప్రజలు రూ.50 వేలకు మించి నగదుతో ప్రయాణిస్తే తప్పనిసరిగా ఆధారాలు ఉండాలని, లేకపోతే సీజ్ చేస్తామని అధికారులు సూచిస్తున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.