AP: మాజీ సీఎం జగన్ కోడికత్తికి ఎక్కువ.. గొడ్డలికి తక్కువ అని మంత్రి నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు. తాము ఆరోపణలు చేయలేక కాదని.. తమకు సభ్యత ఉందని తెలిపారు. వైనాట్ 175 అని 11కు పడిపోవడంతో జగన్కు మతిభ్రమించిందని విమర్శించారు. జర్మనీ చట్టాలు ఏపీలో అమలు చేస్తానంటే ఎలా? అని ప్రశ్నించారు. తాడు, బొంగరం లేని పార్టీ వైసీపీ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.