మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చి 10 రోజులు అవుతున్నా.. సీఎం ఎవరనేదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సీఎం అధికారిక నివాసంలో ఏక్నాథ్ షిండేను ఫడ్నవీస్ కలిశారు. అయితే, షిండే-ఫడ్నవీస్ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా, రేపు బీజేపీ శాసనసభాపక్షం సమావేశం కానుంది. ఎల్లుండి మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.