AP: హిందూ ధర్మంలో తప్పు జరిగితే మౌనంగా ఉండాలని సినీనటుడు ప్రకాశ్ రాజ్ అన్నారని.. తాను ఎందుకు మాట్లాడకూడదో చెప్పాలని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. సెక్యూలరిజం పేరుతో వేరే మతాలపై మీరు మాట్లాడగలరా? అని నిలదీశారు. తన ధర్మంలో తప్పు జరిగితే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. ఇస్లాం, క్రిస్టియన్లలలో తప్పులు జరిగితే ఇలాగే మాట్లాడుతారా? అని అన్నారు. తిరుమల లడ్డూపై పొన్నవోలు సుధాకర్ మదం ఎక్కిన వ్యాఖ్యలు చేశారని వార్నింగ్ ఇచ్చారు.