»Bollywood Star Hero Ayushmann Khurrana Father Death News
Ayushmann Khurrana : సినీ ఇండస్ట్రీలో విషాదం..స్టార్ హీరో తండ్రి కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా తండ్రి కన్నుమూశారు. ప్రముఖ జ్యోతిష్యుడు వీరేంద్ర ఖురానా నేడు చనిపోయారు. కొద్దిరోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Ayushmann Khurrana : సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా(Ayushmann Khurrana) తండ్రి కన్నుమూశారు. ప్రముఖ జ్యోతిష్యుడు వీరేంద్ర ఖురానా(virenda Khurrana) నేడు చనిపోయారు. కొద్దిరోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నేడు పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. ఖురానా మరణంతో బాలీవుడ్(Bollywood)లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సాయంత్రం 5.30 గంటలకు మణిమజ్ర శ్మశాన వాటికలో వీరేంద్ర ఖురానా అంత్యక్రియలు కుటుంబ సభ్యులు నిర్వహించనున్నారు.
ఆయన మృతి పట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు, ఆయుష్మాన్ ఖురానా అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు. ఖురానా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. ఆయుష్మాన్ ఖురానా తొలుత ఎంటీవీ వీడియో జాకీగా పనిచేశారు. ఈయన ‘విక్కీ డోనర్’(Vicky Donar) సినిమాతో హీరోగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. నటుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన ‘అంధాదున్’ లోని నటనకు గాను విక్కీ కౌశల్(Vicky Koushal)తో కలిపి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు సొంతం చేసుకున్నారు. ఈయన తమ్ముడు అపర్ శక్తి ఖురానా కూడా నటుడే. ఈయన రీసెంట్గా అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన ‘జూబ్లీ’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.