బాలయ్య కొన్ని రోజులుగా వరుస వివాదంలో చిక్కుంటున్నాడు. ఇటీవల ‘వీరసింహారెడ్డి’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో దేవ బ్రాహ్మణల మనోభావాలను దెబ్బతీసేలా బాలబాలకృష్ణ వ్యాఖ్యలు ఉన్నాయి. అంటూ ఆ సంఘం వారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
దానికి బాలకృష్ణ స్పందిస్తూ బహిరంగా లేఖ ద్వారా క్షమాపణలు తెలియజేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కూడా అక్కినేని నాగేశ్వరరావుని అవమానపరిచేలా బాలయ్య వ్యాఖ్యానించారు అంటూ వివాదం రాచుకుంది. ఈ వ్యాఖ్యలు పై అక్కినేని హీరోలు కూడా అభ్యంతరం తెలియజేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి బాలకృష్ణ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవల ప్రసారం అయిన పవన్ అన్స్టాపబుల్ ఎపిసోడ్ లో బాలయ్య మాట్లాడిన కొన్ని మాటలు పై ఏపీ నర్సింగ్ సంక్షేమ సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ షోలో బాలయ్య తనకి గతంలో జరిగిన యాక్సిడెంట్ గురించి మాట్లాడుతూ.. ‘ఆ నర్సు, దానమ్మ భలే అందంగా ఉందిలే’ అంటూ కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి అంటూ ఏపీ నర్సింగ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు స్వచ్ఛంద ప్రసాద్ పేర్కొన్నాడు. బాలకృష్ణ వెంటనే ఈ మాటలను వెనక్కి తీసుకోవాలని, నర్సులకు తాను బహిరంగా క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. క్షమాపనులు తెలియజేయకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి వారు హెచ్చరించారు.