ఆధ్మాత్మిక గురువు ఆశారాం బాపూకు గాంధీనగర్ సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. 2013లో శిష్యురాలిపై లైంగికదాడి కేసులో శిక్షను ఖరారు చేసింది. సూరత్‌కు చెందిన మహిళ అహ్మదాబాద్ మోతెరా ఆశ్రమంలో ఉన్న సమయంలో పదేళ్ల పాటు అత్యాచారం చేశాడట. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గాంధీనగర్ సెషన్స్ కోర్టుకు ఆధారాలను సమర్పించారు. విచారణ జరిపి, మంగళవారం తుది తీర్పును ధర్మాసనం వెల్లడించింది. ఆశారాం బాపుకు ఇది రెండో కేసు.. 2018లో ఓ మహిళపై లైంగికదాడి చేయడంతో రాజస్థాన్ కోర్టు దోషిగా తేల్చింది. ప్రస్తుతం ఆయను జోధ్ పూర్ జైలులో ఉన్నారు.
సూరత్‌కు చెందిన మహిళకు చెల్లి కూడా ఉంది. అక్కపై ఆశారాం బాపు రేప్ చేయగా.. చెల్లిపై ఆయన కుమారుడు నారాయణ్ సాయి లైంగికదాడి చేశాడు. 1997 నుంచి 2006 వరకు మోతెరా ఆశ్రమంలో అక్క ఉంది. ఆ సమయంలో ఆశారాం బాపు అత్యాచారానికి పాల్పడ్డాడు. సూరత్‌లో గల జహంగిపుర ప్రాంతంలో చెల్లిని నారాయణ్ సాయి రేప్ చేశాడు. 2013లో కేసు నమోదు చేయగా, విచారణ జరిగింది. ఆ కేసులో నారాయణ్ సాయికి జీవిత ఖైదు విధించగా.. ఇప్పుడు తండ్రికి శిక్ష పడింది. ఆధ్యాత్మిక ముసుగులో శిష్యురాలిపై తండ్రి, కొడుకులు అత్యాచారానికి పాల్పడ్డారు. చేసిన నేరం రుజువు కావడంతో కోర్టు శిక్షను ఖరారు చేసింది.