TG: ఆర్మూర్ మండలంలోని అంకాపూర్‌లో వ్యవసాయ వర్సిటీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నిన్న అసెంబ్లీలో ప్రస్తావించారు. అంకాపూర్ రైతులు ఏడాదికి నాలుగు పంటలు పండిస్తారని, అన్ని అర్హతలు ఉన్న గ్రామం అంకాపూర్ అని వెల్లడించారు. అలాగే నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజీ మంజూరు చేయాలన్నారు. త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.