నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞను ‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ హీరోగా పరిచయం చేయనున్నారు. వారి కాంబినేషన్లో వస్తున్న సినిమాపై కొన్ని రోజులుగా వస్తున్న రూమర్స్‌పై నిర్మాణ సంస్థ ‘ఎస్ఎల్వీ సినిమాస్’ తాజాగా స్పందించింది. ‘‘మోక్షజ్ఞ- ప్రశాంత్ వర్మ ప్రాజెక్టు గురించి ఊహాగానాలు వచ్చాయి. వాటిలో నిజం లేదు’’ అని పేర్కొంది.