TG: తెలంగాణ నూతన హైకోర్టు నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. రాజధాని శివారులోని రాజేంద్ర నగర్లో 100 ఎకరాల్లో కొత్త హైకోర్టును నిర్మించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం రూ. 2583 కోట్లు మంజూరు చేసింది. వీటిలో సివిల్ పనుల కోసం రూ.1980 కోట్లు, ఇతర పనుల కోసం రూ. 603కోట్లు ఖర్చు చేయనున్నారు. కాగా ఈ పనుల కోసం వచ్చే నెలలో టెండర్లు పిలవనున్నట్లు తెలుస్తోంది.