దేశీయ మార్కెట్లో సుజికీ కార్లకుండే డిమాండ్ గురిచి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మిడిల్ క్లాస్ పీపుల్స్‌కు తగ్గట్లుగా మైలేజ్, మెయింటెనెన్స్ దృష్టిలో పెట్టుకొని ఈ సంస్థ కార్లను తయారు చేస్తోంది. అయితే ఈ ఏడాదిలో 20 లక్షల కార్లను అమ్మింది. ఈ మేరకు సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఒకే క్యాలెండర్ ఇయర్లో 20 లక్షల ప్యాసింజర్ వాహనాలు అమ్మిన మొదటి బ్రాండ్‌గా మారుతీ సుజికీ రికార్డు సృష్టించింది.