TG: BRS హయాంలో 11 ప్రాజెక్టులకు DPR పంపితే ఏడు ప్రాజెక్టులకు అనుమతులు సాధించామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ‘రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క DPR పంపలేదు. మూడు DPRలు వెనక్కి తెచ్చారు. మేము ప్రాజెక్టుల కోసం సుప్రీం కోర్టుకు వెళ్లాం. మా సక్సెస్ రేట్ 60 శాతం, మీ సక్సెస్ రేట్ మైసన్ 30 శాతం. కేంద్రంపై పోరాటం చేసి KCR సెక్షన్ 3ని సాధించారు’ అని వెల్లడించారు.