బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాఘోపూర్ స్థానం నుంచి పోటీ చేసిన ఆర్జేడీ నేత, ప్రతిపక్ష కూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ వెనుకంజలో ఉన్నారు. ప్రస్తుతం 1273 ఓట్ల వెనుకంజలో కొనసాగుతున్నారు. మూడో రౌండ్లో బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ ఆధిక్యంలోకి వచ్చారు. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద ఆర్జేడీ నేతలు నిరాశలో ఉన్నారు.