చాలామంది టీతోనే తమ రోజును ప్రారంభిస్తారు. అయితే గ్రీన్ టీ, బ్లాక్ టీతో శీతాకాలంలో వచ్చే చర్మ, జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. చల్లని గ్రీన్ టీతో ముఖం కడుక్కుంటే చర్మం పొడిబారే సమస్య దరిచేరదు. టబ్బు నీటిలో గ్రీన్ టీ డికాక్షన్ వేసి అందులో పాదాల్ని కాసేపు ఉంచితే పాదాల పగుళ్లు, పాదాలకు చెమట పట్టే సమస్యలు తగ్గుతాయి. తలస్నానానికి ముందు బ్లాక్ టీని తలకి అప్లై చేసుకుంటే జుట్టు చిట్లటం తగ్గుతుంది.