SRD: గుమ్మడిదల BJP కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి 101వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు కావలి ఐలేష్ నేతృత్వంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, మిఠాయిలు పంపిణీ చేసి శ్రద్ధాంజలి అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.