AP: నైరుతి-ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో శ్రీలంక, తమిళనాడు తీరాలవైపు పయనించే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. అనంతరం వాయుగుండంగా బలపడుతుందని అంచనా వేసింది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది. ఇవాళ, రేపు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.