AP: విశాఖ డెయిరీ ప్రధాన ద్వారం ఎదుట పాడి రైతులు బైఠాయించారు. పాల ధర పెంచాలంటూ మరోసారి ఆందోళనకు దిగారు. ధర్నాలో రైతులు, వారి కుటుంబ సభ్యులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. విశాఖ డెయిరీ అడ్మిన్ బిల్డింగ్ వద్ద అల్లర్లు జరగకుండా పోలీసులను భారీగా మోహరించారు.