AP: మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడి జరుగుతుందని AISF వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం వెంటనే విచారణ జరపాలని AISF జాతీయ కార్యదర్శి శివారెడ్డి ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఫీజుల దోపిడీపై మంచు మనోజ్ స్టేట్మెంట్ను సుమోటోగా స్వీకరించి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రతి విద్యార్థి నుంచి ప్రతి ఏటా రూ. 20వేలు అదనంగా వసూలు చేస్తున్నారన్నారు. ప్రశ్నించినవారిపై దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు.