TG: ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా HPV టీకాల పంపిణీని ఆరోగ్యశాఖమంత్రి రాజనర్సింహ ప్రారంభించనున్నారు. కింగ్ కోఠి ఆసుపత్రిలో హెచ్పీవీ టీకాల కార్యక్రమం ప్రారంభం కానుంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం 14 ఏళ్లు దాటిన బాలికలకు ఉచితంగా హెచ్పీవీ టీకాలు పంపిణీ చేయనున్నారు.