TG: రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసని కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. BRS రెండోసారి అధికారంలోకి వచ్చాక పాలమూరు ప్రాజెక్టు పేరుతో దోపిడీకి తెరలేపిందని, ప్రాజెక్టులో కాల్వల నిర్మాణం, లిఫ్టుల పేరుతో వ్యయం అంచనాలు పెంచిందన్నారు. ఆ పార్టీ అక్రమాలను కవిత బయటపెడుతోందని చెప్పారు. అక్రమాలను ఎవరు బయటపెట్టినా BJP అండగా ఉంటుందన్నారు.