AP: విశాఖ డెయిరీ అవకతవకలపై సభా సంఘం భేటీ ముగిసింది. ఈ నెల 9న విశాఖ డెయిరీ సందర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. అదేరోజు సాయంత్రం కలెక్టరేట్లో అధికారులతో సమావేశానికి నిర్ణయించారు. విశాఖ డెయిరీపై వచ్చిన అభియోగాలపై సుదీర్ఘంగా చర్చించామని కమిటీ ఛైర్మన్ జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. విచారణ ఎలా ప్రారంభించాలని ప్రాథమికంగా చర్చించామని, విశాఖ డెయిరీ, ఆర్థిక లావాదేవీలు చూసేవారు సమావేశానికి రావాలని సూచించారు.