జిడ్డు చర్మతత్వం ఉన్నవారు తమ చర్మాన్ని పొడిగా ఉంచే ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలో సన్‌స్క్రీన్ వాడరు. అలా చేస్తే ఎండకి చర్మం పాడవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆయిల్ స్కిన్ ఉన్నవారు నీటి ఆధారిత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇది చర్మానికి తగినంత పోషణను అందిస్తుంది. అధిక పౌడర్ వినియోగంతో జిడ్డు చర్మాన్ని కవర్ చేస్తే మొటిమలు వస్తాయి. అంతేకాదు చర్మం మరింత జిడ్డుగా మారుతుంది. సహజసిద్ధమైన శాండల్ పౌడర్ వాడితే మంచిది.