VSP: విశాఖలో లా విద్యార్థిని అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్ధి సంస్థ (పీడీఎస్ఓ) ఆధ్వర్యంలో గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్లకార్డులు చేతబోని నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నాయకులు రాజు పాల్గొన్నారు.