TG: గాంధీభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజావాణి నిర్వహించారు. ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. గత ప్రభుత్వంలో బంధించి పాలించారని విమర్శించారు. ప్రజా పాలనలో తామే ప్రజల దగ్గరకు వెళ్తున్నామని అన్నారు. ప్రజాసమస్యలు తీర్చడం, ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యమని తెలిపారు. విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. 59 వేల ఉద్యోగాలు ఇచ్చామని.. మహిళలను కోటీశ్వరులను చేస్తామని తెలిపారు.