TG: భిన్నత్వంలో ఏకత్వం మనదేశ గొప్పతనమని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలోనే తొలిసారి తెలంగాణలో లోక్ మంథన్ నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు, ఆహార రుచులను అతిథులు ఆస్వాదించాలని కోరారు. సంస్కృతులు, భాషలు, కులాలు, మతాలు మనదేశంలో భాగమని తెలిపారు.