AP: అబద్ధాలు చెప్పడంలో జగన్ దిట్టని మంత్రి గొట్టిపాటి విమర్శించారు. విద్యుత్‌పై జగన్ మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్‌కు ట్రూప్ అప్ ఛార్జీల గురించి మాట్లాడే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. రూ.18 వేల కోట్ల భారం ప్రజల మీద మోపారని జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు. మీరు చేసిన పాపాలే.. నేటికీ ప్రజలకు శాపాలుగా పీడిస్తున్నాయని మండిపడ్డారు.