TG: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయం త్వరలో ముగిసిపోతుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రస్తుతం ఈ విషయం స్పీకర్ పరిధిలో ఉందని, ఎమ్మెల్యేలు తమ అఫిడవిట్లో అన్ని విషయాలు వెల్లడించారని పేర్కొన్నారు. ఇక గ్రూప్1 పరీక్షల్లో ఎలాంటి ఆక్రమాలు జరగలేదని, TGPSC చిత్తశుద్ధితో ముందుకువెళ్తోందని తెలిపారు. గ్రూప్1 ఉద్యోగాలు పొందినవారిపై నిందలు వేయడం అన్యాయమన్నారు.