పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై ‘ఆపరేషన్ సింధూర్’ నేపథ్యంలో భారత్లో భద్రతా బలగాలు, పోలీసులు అప్రమత్తమయ్యారు. పంజాబ్, రాజస్థాన్లో హై అలర్ట్ ప్రకటించగా.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. రక్షణశాఖ వర్గాలతో పోలీసులు సమన్వయం చేసుకుని ముందుకుసాగాలని UP రాష్ట్ర డీజీపీ సూచించారు. ప్రజలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని తెలిపారు.