కుటుంబ వివాదాలకు సంబంధించి విచారణకు హజరైన నటులు మంచు మనోజ్, విష్ణులను రాచకొండ కమిషనర్ సుధీర్‌బాబు హెచ్చరించారు. కుటుంబ వివాదాలను శాంతి భద్రతల సమస్యగా మార్చవద్దని సూచించారు. శాంతియుతంగా కుటుంబ సమస్యను పరిష్కరించుకోవాలని తెలిపారు. మరోసారి ఎలాంటి సమస్యలు సృష్టించొద్దని, ఇంకోసారి గొడవలు చేస్తే మాత్రం తీవ్ర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు.