TG: వరంగల్ నగరాభివృద్ధిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరంగల్ భద్రకాళి చెరువు, విమానాశ్రయం తదితర అంశాలపై చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల మేరకు పనులు యుద్ధప్రాతిపదికన జరపాలని, ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టాలని ఆదేశించారు. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమీక్షలో మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు నరేందర్రెడ్డి పాల్గొన్నారు.