TG: ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద ఘటన మంచిర్యాల జిల్లా కాసిపేటలో జరిగింది. తమ ఇద్దరు పిల్లలతో కలిసి దంపతులు పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నారు. ఈ ఘటనలో దంపతులు, కుమార్తె మరణించగా.. కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అప్పుల బాధ తాళలేక ఆ కుటుంబం ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.