బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ గెలుపు ఖాతాను తెరిచింది. ఎన్డీయే కూటమి ఆధిక్యంలో దూసుకుపోతున్న వేళ.. బీజేపీ అభ్యర్థులు కీలక నియోజకవర్గాల్లో జయకేతనం ఎగురవేశారు. దర్బంగా నుంచి సంజయ్ సరోగి, డాక్టర్ మురారి మోహన్ ఝా(కియోటి), రాజ్ కుమార్ సింగ్(సాహెబ్గంజ్), ప్రేమ్ కుమార్(గయ టౌన్), సంజయ్ కుమార్ పాండే(నర్కిటియాగంజ్) గెలుపొందారు.