నిషేధిత లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ హఫీజ్ అబ్దుల్ రహమాన్ మక్కీ గుండెపోటుతో మృతి చెందాడు. ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు బావమరిది అయిన మక్కీ మధుమేహంతో బాధపడుతూ లాహోర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో తుది శ్వాస విడిచాడు. మక్కీకి 2020లో టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.