TG: బీఆర్ఎస్ నేతలకు మరోసారి చుక్కెదురైంది. నల్గొండలో మాజీమంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రైతు మహాధర్నాకు పోలీసుల నుంచి అనుమతి లభించలేదు. దీంతో బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. అయితే రేపు ధర్నా నిర్వహించే తీరుతామని BRS నేతలు తేల్చిచెప్పారు. దీనిపై ఉత్కంఠ నెలకొంది.