TG: శ్రీరాముడిని అవమానించటం కాంగ్రెస్ నేతలకు అలవాటని కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ‘రాముడు లేడు, రామాయణం లేదని కాంగ్రెస్ సుప్రీంకు చెప్పింది. రాముడిని BJP సభ్యుడిగా చూస్తుందని ఎగతాళి చేస్తోంది. అపహాస్యం చేయటం కాంగ్రెస్ DNAలోనే ఉంది. కానీ రాముడు భారత్ DNAలో ఉన్నాడు. రాముడంటే భారత్ హృదయ స్పందన. ప్రతి ప్రార్థన, పండగ, ప్రతి గ్రామంలో రాముడు ఉంటాడు’ అని తెలిపారు.