2025 జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. దీనిపై చైనా అధ్యక్షుడు అంగీకరించారా?.. లేదా..? అనే విషయం తెలియరాలేదు. అలాగే దీనిపై వాషింగ్టన్‌లోని చైనా ఎంబసీ స్పందించలేదు. కాగా, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జిన్‌పింగ్‌తో తనకు మంచి సంబంధాలున్నాయని, ఈ మధ్యే తాము మాట్లాడుకున్నామని ట్రంప్ తెలిపారు.