తెలంగాణ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని మాజీమంత్రి KTR అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘అమృత్ 2.O టెండర్లలో కాంగ్రెస్ అవినీతి స్పష్టంగా కనిపిస్తోంది. 8 ప్యాకేజీలుగా టెండర్లు పిలిచి, అర్హత లేకపోయినా శోధా కంపెనీకి టెండర్లు ఇచ్చారు. CM రేవంత్ బావమరిది సృజన్ రెడ్డికి టెండర్లు అప్పగించారు. వాటిని రద్దు చేయాలని కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కోరాం. టెండర్లపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశాం’ అని తెలిపారు.