వేడి నీటితో స్నానం చేయడం పలు సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల చర్మం సహజ తేమ తొలిగిపోయి.. చర్మం పొడిబారిపోతుంది. చికాకు, దురద, పగుళ్లు ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు వేడి నీళ్లతో స్నానం చేస్తే.. గుండెపోటు వచ్చే ఛాన్స్ ఉంది. శరీరం బలహీనంగా మారుతుంది. తల తిరిగటం, డీహైడ్రేషన్, వికారం, మూర్ఛ వంటి సమస్యలు వస్తాయట. శరీర ఉష్ణోగ్రత పెరిగి, బీపీ పెరుగుతుందట.