AP: పహల్గామ్ దాడికి వేగంగా ప్రతీకారం తీర్చుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ‘భారత సాయుధ దళాల ధైర్యసాహసాలకు నేను గర్వంగా వందనం చేస్తున్నాను. ఉక్కు సంకల్పంతో భారత్ తనను తాను రక్షించుకుంటుందని నిరూపించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన దేశానికి ఉన్న బలం, దృఢ సంకల్పాన్ని ఇవాళ ప్రపంచం చూసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం ఐక్యతతో ఉంది. జైహింద్’ అని ట్వీట్ చేశారు.