ప్రధాని మోదీ నివాసంలో కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ(CCS) సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ఢిల్లీలో పేలుడు ఘటనపై చర్చించనున్నారు. ఉగ్రవాదుల ఏరివేతకు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.