ఆపరేషన్ సింధూర్పై జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందించారు. పహల్గామ్ దాడికి ఇదే సరైన సమాధానమని అన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా దాడులు జరిగాయని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్లో విద్యాసంస్థలు తెరిచే ఉన్నాయని చెప్పారు. విమానాశ్రయాలు మాత్రం భద్రతా కారణాల దృష్ట్యా మూసివేశామని పేర్కొన్నారు.