AP: సీఎం చంద్రబాబు తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. అసెంబ్లీలో చీఫ్ విప్‌గా తనను నియమించిన చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు అయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. శాసనసభ సజావుగా సాగేందుకు చీఫ్ విప్‌గా తన బాధ్యతలు నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. కాగా, అసెంబ్లీ చీఫ్ విప్‌గా జీవీ ఆంజనేయులును కూటమి ప్రభుత్వం తాజాగా నియమించింది.